January 19, 2009

కొత్త సినిమాల కబుర్లు..



జోష్
..దిల్ రాజు బ్యానర్ లో వాసు వర్మ దర్సకత్వం లో నాగ చైతన్య హీరో గా రూపుదిద్దుకుంటున్న చిత్రం పేరు..ఇంకా అనౌన్స్ చెయ్యలేదు .ఈ మద్యనే కార్తీక [రాధ కూతురు] ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.
  • ఈ సినిమా స్టొరీ నాగార్జున "శివ" స్టొరీ ని పోలి ఉంటుందని కాలేజీ backdrop లో action entertainer గా రూపొందిస్తున్నారని సమాచారం.
  • కొంత మంది siva part 2 అంటున్నారు..
  • ఇప్పటికి 7days షూటింగ్ మాత్రమే జరిగింది.
  • siva మూవీ లానే ఇది కూడా wonders create చెయ్యాలని కోరుకుందాం..


కృష్ణం వందే జగద్గురుం.
గమ్యం సినిమా దర్శకుడు క్రిష్ , వెంకటేష్ & అశ్వనిదత్ కాంబినేషన్ లో ప్రారంభం కావాల్సిన మూవీ ఎందుకు లేట్ అవుతుంది....
  • వెంకటేష్ కి స్క్రిప్ట్ నచ్చలేదని అందుకే మార్పులు చేర్పులు చేస్తున్నారని అంటున్నారు..
  • చింతకాయల రవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం తో వెంకటేష్ ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని స్క్రిప్ట్ విషయం లో అస్సలు compramaise అవడం లేదట..
  • ఇదిలా ఉంటే ఆకుల శివ [లక్ష్మి సినిమా స్టొరీ రైటర్] కూడా వెంకటేష్ కి కథలు చెప్పే పని లో ఉన్నారని..ఆ కథలలో ఏదైనా నచ్చితే , కృష్ణం వందే జగద్గురుం ఇంకా లేట్ అవుతుందని సమాచారం.



పౌరుడు
తో ఫ్లాప్ డైరెక్టర్ అనిపించుకున్న రాజ్ ఆదిత్య [ మల్లు కుర్రాడు..] వరుస సినిమా తో బిజీ బిజీ గా ఉన్నాడు..
  • మళ్లీ మళ్లీ..రిలీజ్ కి రెడీ గా ఉంది..
  • తరుణ్ హీరో గా సుప్రీం ఆడియో అధినేత రాజూ హిర్వాణి నిర్మాత గా ఇంకో సినిమా షూటింగ్ కి రెడీ గా ఉంది..
  • best of luck..raaj adithya.



January 18, 2009

మీకు తెలుసా...?


  • orkut రూపకర్త buyukkokten [టర్కీ దేశస్థుడు ] సంపాదన ఎలా ఉంటుందో తెలుసా?
  1. ఆర్కుట్ లో కొత్త వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న ప్రతిసారి google నుంచి $12 buyukkokten అకౌంట్లోకి చేరుతాయు..వాళ్ల స్నేహితులు చేరితే $10 ..వాళ్ల స్నేహితుల స్నేహితులు చేరితే $8 ..
  2. photos upload చేస్తే $200 ..
  3. మీరు ఎవరి ఫాన్స్ లిస్టులో చేరినా $2..
  4. display picture మార్చిన ప్రతిసారి 50 cents.. ఇలా చాల రకాలుగా అతని అకౌంట్లోకి డబ్బులు వెళ్తూనే ఉంటాయి..

January 16, 2009

arundhathi movie review.


story and screenplay : mallemala unit.

graphics &
creative director : rahul nambiar.

music :koti.

cinematography : k.k.senthil kumar.

editing : marthand.k.venkatesh.

action : vijay.

dialogues : chintapalli ramana..

producer : m.syam prasad reddy..

director : kodi rama krishna




story,screenplay&direction:

  • కథ చాలా బాగుంది..:అరుంధతి[అనుష్క] పెళ్లికి ముహూర్తం పెట్టారని తెలుసుకున్న ఒక ప్రేతాత్మ తన క్షుద్ర శక్తులతో అరుంధతి ని అరుంధతి family ని గద్వాల్ కి వచ్చేలా చేస్తుంది..అక్కడ అరుంధతి కి తనని ఒక శక్తి చంపాలని ట్రై చేస్తుందని అది ప్రేతాత్మ అని అన్వర్[shinde] క్యారెక్టర్ ద్వారా తెలుసుకుంటుంది.
అసలు ఆ ప్రేతాత్మ ఎవరు.. తనని చంపాలని ఎందుకు ట్రై చేస్తుంది అనే విషయం తన తాతయ్య [kaikala satyanarayana] ఇంట్లో నాలుగు తరాలుగా వాళ్ల దగ్గరే పని చేస్తున్న
మనోరమ character ద్వారా తెలుసుకుంటుంది...జేజమ్మ character [గత జన్మలో గద్వాల్ సంస్థానానికి రాణి అయునా అరుంధతి [అనుష్క]ని వాళ్ల దేవత పేరుతో అలా పిలుస్తుంటారు ]ప్రాణ త్యాగం చేసి మళ్లి ఎందుకు arundhati గా జన్మించింది.చివరికి ఆ ప్రేతాత్మ ని ఎలా సంహరించింది ఆనే విషయాలు స్క్రీన్ పైన చూడండి..

  • fantasy కథలు వినటానికి ,చూడటానికి interesting గా ఉంటాయు..కానీ స్క్రీన్ ప్లే రాయడం కష్టం making ఇంకా కష్టం..making లో సక్సెస్ అయ్యారు...కాని స్క్రీన్ ప్లే రాసుకోవడం లో తడబడ్డారు..
  • అందుకు బెస్ట్ example.. flashback పూర్తిగా తెలిసి ..reveal చేసే మనోరమ క్యారెక్టర్ flashback లో కనిపించకపోవడం..
  • second half లో vilanism ఎక్కువై arundhathi character తేలిపోయుంది..
  • second half మొత్తం ప్రేతాత్మ సృష్టించే హడావుడి ..ఆ ప్రేతాత్మని ఎదుర్కోలేక arundhathi పడే ఇబ్బందులు..ప్రేతాత్మని అంతం చేసే ఆయుధం కోసం అన్వేషణ..
  • జేజమ్మ character [గత జన్మలో గద్వాల్ సంస్థానానికి రాణి అయునా అరుంధతి ని వాళ్ల దేవత పేరుతో అలా పిలుస్తుంటారు ] ని మూవీ లో highlight చెయ్యాలని ట్రై చేసారు..కాని స్క్రీన్ ప్లే లోపాల వల్ల ఆ character అనుకున్న స్తాయులో elevate కాలేదు. అదే ఈ సినిమా లో ప్రధాన లోపం ..
  • creative director & garphics supervisor రాహుల్ నంబియార్ ..ఈ సినిమా ని అద్యద్భుతమైన technical cinema గా రూపుదిద్దాడు.
  • my openions :
  1. గద్వాల్ సంస్థానం లో రాజు గారి మేనల్లుడు కి [సోనుసుద్] మీసాలు ఉండవు...4 తరాల వెనుక.. అది కూడా రాజుల సంస్థానం లో?..
  2. సోనుసుద్ అగోరా ల దగ్గర క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు..జేజెమ్మ character ప్రేతాత్మ బారి నుంచి ఊరి ని , తన వంశాన్ని కాపాడటానికి కూడా ఆగోరాల సహాయం తీసుకుంటుంది ... చెడు పై యుద్ధం చేసే మంచి యోగుల సహాయం తీసుకుంటే బాగుండేది..
  3. అరుంధతి కి నేనే జేజమ్మ అవతారం ..అని తెలిసాక ఆ జేజెమ్మ character ని ఈ అరుంధతి own చేసుకొని పశుపతి పై యుద్ధం చేసి ఉంటే సినిమా ఇంక ఇంట్రెస్ట్ గా ఉండేది..
  4. గద్వాల్ సంస్థానాన్ని , చిన వెంకట రాయ రాజు గారి character ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చెయ్యల్సింది.. [సంస్థానం లో పని వారిని ..సలహాదారులని ...ఎవరిని ఎస్టాబ్లిష్ చెయ్యలేదు...]
graphics :
  • ఈ సినిమా లో అత్యద్భుతమైన graphics ని చూడొచ్చు..rahul nambiar పడిన కష్టం స్క్రీన్ ఫై కనిపిస్తుంది ..total సినిమాని తన గ్రాఫిక్ వర్క్ తో lift చేసాడు..
  • total cinema story ని graphic work కాపాడింది...తెలుగు audience కి సరికొత్త సినిమా ని చూపించింది.
cinematography :

  • సినిమా కి సెంధిల్ తో పాటు ఇంకో నలుగురు cameramens clash work చేశారు .[due to number of working days] cinematography మూవీ లో graphics తర్వాత మరో plus point..
music :
  • ఈ సినిమా కి కొటి మ్యూజిక్ చేశారు అంటే నమ్మడం కష్టమే..songs బాగున్నాయు..
  • background score super..
  • sonusud కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ గురించి చెప్పాలి...awesome ..voice తో mesmerise చేశాడు..
production values :
  • తెలుగు సినిమాలలో productin values తక్కువ అని అందరికి తెలుసు..
  • సినిమాని ప్రేమించే producers తక్కువగా కనిపిస్తుంటారు...ఆ తక్కువలో కూడా ఎక్కువగా సినిమా ని ప్రేమించే వాళ్ళల్లో శ్యాం గారు ఒకరు...
  • బుల్లి తెర ఫై కూడా తన big vision ని DHEE [E.TV ] ప్రోగ్రాం ద్వారా చూపించారు..
  • annapurna studioes లో two floors లో సెట్స్ వేసి 20 days లో పూర్తి చెయ్యాల్సిన work ని compramise కాకుండా చెయ్యడం వల్ల 100 days చేశారు..
  • 13 crores ఖర్చుపెట్టి సినిమా కి కావలసిన హంగులన్నీ సమకూర్చారు..
  • మన తెలుగు industrey గర్వించే ప్రొడ్యూసర్ ..శ్యాం గారు..hatsoff ..
artistes performance :

anushka :
  • యువరాణి జేజెమ్మ క్యారెక్టర్ కి ..ఈతరం అరుంధతి క్యారెక్టర్ కి రెండిటికి అనుష్క బాగా సూట్ అయింది..అక్కడే సగం మార్క్స్ కొట్టేసింది..ముఖ్యంగా జేజెమ్మ క్యారెక్టర్ గెటప్ తనకి బాగా సూట్ అయుంది..తన looks and body language తో audience ని ఆకట్టుకుంటుంది..కొన్ని heavy emotion scenes లో తన performance super..
  • భయానికి , అవకాశం లేక వెనకడుగు వెయ్యడానికి చాలా చిన్న తేడా ఉంటుంది..సోనుసుద్ క్షుద్ర విద్యలతో సంస్థానానికి వచ్చినప్పుడు తన performance లో ఆ తేడాని చూపించింది..
sonusud :
  • అగోరాగా getup స్టార్ట్ అయ్యాక.. సినిమా ఎండింగ్ వరకు కూడా సోనుసుద్ డామినేట్ చేశాడు...
shayaji shinde :
  • మంచి క్యారెక్టర్ ని తన గుడ్ పెర్ఫార్మన్స్ తో నిలబెట్టాడు..ఈ సినిమా లో anwar characterisation graph మొదటి నుంచి చివరి వరకు increase అవుతూ ఉంటుంది.
others :
  • జేజెమ్మ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన child artiste చాలా బాగా చేసింది..
  • sonu అమ్మగా సుభాషిణి ని కరెక్ట్ గా ఎంచుకున్నారు..తన cruel looks తో బయపెట్టింది..
  • జేజెమ్మ husband ని అస్సలు చూపించకున్న బాగుండేది..

TOTAL గా arundhathi అద్భుతమైన సినిమా [కొన్ని స్క్రీన్ ప్లే లోపాలతో] కాలేకపోయుంది..


January 15, 2009

ఫన్నీ..


  • బ్రహ్మచారి .. మంచాన్ని రెండు వైపుల నుంచి దిగగలిగేవాడు...
  • పెళ్ళంటే .. చేపని పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చెయ్యు పెట్టడం లాంటిది.
  • మగాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు రావడానికి కారణం ఆడవారే..మగాళ్ళు వాటిని సాదించలేకపోవటానికి కూడా కారణం వాళ్ళే ..


కొత్త సామెతలు..




  • జీవితం జోక్ అయుతే..నవ్వడం కష్టమవుతుంది!!
  • ప్రపంచంలో అందమైనవి రెండు.. ఒకటి అమ్మాయులు రెండు అబద్దాలు..

January 14, 2009

maska review..

కధ : సూర్య .
స్క్రీన్
ప్లే , నిర్మాత : యమ్.ఎస్.రాజు .
సినిమాటోగ్రఫీ : శేఖర్.వి.జోసెఫ్ .
రచన
: పరుచూరి బ్రదర్స్.
సంగీతం :చక్రి
స్టంట్స్ :
రామ్ లక్ష్మణ్.
ఆర్ట్
: రాజీవ్ నాయర్.
ఎడిటింగ్
:కోటగిరి వెంకటేశ్వరరావు .
పాటలు
:కందికొండ .

కథ ,కథనం,మాటలు : మస్కా..కథ కంటే కధనాన్ని నమ్ముకున్న సినిమా.
70 scenes లో entertainment,action సమానం గా కలిపి రూపొందించిన సినిమా.
m.s raju
ఒక్కడు సినిమా నుంచి ఎక్కువగా ఒక ఫార్ములాని ఫాలో అవుతున్నారు ..హీరోయిన్ ని విలన్ నుంచి కాపాడే హీరో..అదే కథ .. సినిమా లో కూడా రిపీట్ అయుంది . వర్షం , ఆట , పౌర్ణమి ...సినిమాలలో పాయింట్ ని ఆధారం చేసుకొని కథని నడిపారు...ఇక్కడ కూడా అదే ..కాని చంపాలనుకుంటున్న ఒక విలన్ హీరోయిన్ ఫాదర్..అదే కథలో రాజు గారికి నచ్చిన పాయింట్ అయు ఉండొచ్చు ..
సినిమా మొదలైన 10 minutes కే ఎవరో "వాలి" అని అరిచారు..కాని సూర్య[story writer] తెలివిగా వాలి ని extend చేసి maska లో రామ్ character ని establish చేశాడు.
సినిమా లో అన్ని characters ని కథలో సమర్థంగా వాడుకున్నారు..అది సినిమాలో ఒక ముఖ్య విషయం..

screenplay ఒక పెద్ద ఎస్సెట్ ... ముఖ్యంగా second half లో ..
ఇంటర్వెల్ కి balcony audience కి స్టొరీ అర్థమైపోతుంది..after interval 10 minutes కే twist reveal చేసినా.. ఎక్కడా tempo తగ్గకుండా maintain చేశారు .
entertainment
ని action ని కరెక్ట్ గా మిక్స్ చేశారు..

paruchuri brothres
రాసిన dialogues బాగా పేలాయు...sunil ki రాసిన dialogues కి B and C centers lo కేకలు ఖాయం..ఝాన్సీ tone కి నెల్లూరు యాస బాగా సూట్ అయుంది..చాలా scenes ని dialogues తో ఎలివేట్ చేశారు..
local train
లో రామ్,సునీల్ & షీలా మద్య జరిగే సీన్ ..
ఝాన్సీ హన్సిక ని రామ్ ని ఇంటికి తీసుకొచ్చే సీన్..
ఇంకా చాలా scenes ని dialogues తో elevate చేశారు ..
దర్సకత్వం :
B.GOPAL career
కి సినిమా చాలా ఉపయోగపడుతుంది...తెలుగు cinema industrey లో మంచి మాస్ మసాల సినిమాలు తియ్యడంలో తనకున్న పేరుని పోగుట్టుకున్న b.gopal career కీ oxygen మస్కా సినిమా ..
ఎక్కడ బోర్ కొట్టని మంచి మాస్ entertainer గా మస్కా ని తీర్చిదిద్దారు..

సినిమాటోగ్రఫీ : sekahar.v.joseph....అన్ని సాంగ్స్ ని అద్భుతం గా picturise చేశారు ..action episodes లో ముఖ్యంగా chagings ..blasts.. నాలుగు సూమో లు గాలిలో గుద్దుకునే shots లో ఆయన ప్రతిభ తెలుస్తుంది.
m.s.raju favourite cinematographer..okkadu movie
కి ఆయనే cinematographer.

సంగీతం : చక్రి సంగీతం పర్వాలేదు..songs లో హరే హరే రామ ..high voltage song..
వైపు ఉన్న .. వైపు ఉన్న 3rd song... మైకం కమ్మిందో గుండెల్లో ..దేవి ప్రసాద్ ట్యూన్[ఒక ఊరిలో..] గుర్తొచ్చింది .. బ్యాక్ గ్రౌండ్ స్కోరు 1st half కంటే 2nd half లో మెరుగ్గా ఉండి సినిమాని lift చేసింది ..

stunts : రామ్ లక్ష్మణ్ లు అద్భుతం గా compose చేశారు..ముఖ్యంగా సూమో లు గాలిలో గుద్దుకోవడం..interval episode blastings.. కాని first fight ని ఇంకా మెరుగ్గా compose చెయ్యాల్సింది ...హీరో కోసం అన్ని అమర్చినట్లు తెలిసిపోతుంది..

ఎడిటింగ్ : ఎడిటింగ్ action cinema లకు గుండె లాంటిది...కోటగిరి తన ప్రతిభ తో సినిమా ని ఎక్కడికో తీసుకెళ్ళారు..

ఆర్ట్ : రాజీవ్ నాయర్..తన వంతు పాత్ర ని సమర్థం గా పోషించారు...సాంగ్స్ లో ఆయ వేసిన సెట్టింగ్స్ అదరహొ..

my openions :
  • hero character లైఫ్ లో సెటిల్ అవడం కోసం U.S వెళ్ళే అమ్మయుని trap చెయ్యాలని అనుకుంటాడు..అది హీరోయిజం ?
  • మోసం చేసాడని తెలిసిన తర్వాత కూడా షీలా హీరో character ని లవ్ చెయ్యడం..ఆగిపోయున కధని నడపడం కోసమా?
  • నరేష్ క్యారెక్టర్ ని బాంబు బ్లాస్ట్ లో గాయపడేలా...మాట పోయేలా చేసి రామ్ కి సీక్రెట్ చెప్పించే బదులు...రామ్ నేరుగాషీలా తో మాట్లాడటానికి[48 hrs time అయుపోయింది కాబట్టి]వాళ్ళింటికి వెళితే సరిపోదా?కోడ్ లాంగ్వేజ్ ని వాడుకోవాలని కాబోలు...
  • కూతురి బెడ్ పైన రామ్ ని చూసి ముకేష్ఋషి నవ్వడం ..అయ్య బాబోయ్..
ఇలా చాలా తప్పులు ఉన్నాయు ..కామెడీ కొసం!! .స్టొరీ నడపడం కోసం!!....తప్పని సరై చేసినవి కొన్ని!!..తెలియక చేసినవి ఎన్నో మరి ?...
artistes performance :

  • RAAM ట్రాక్ లో ఇప్పుడే పరుగు మొదలెట్టిన race horse లాంటి వాడు..తన energy levels ని అందుకొనే హీరోప్రస్తుతం టాలీవుడ్ లో ఎవ్వరూ లేరు.. race horse ని correct గా use చేసుకున్నారు B.gopal & m.s raju...చాలా scene ని తన energy to lift చేశాడు రామ్....
  • రామ్ తర్వాత ఎక్కువ మార్క్స్ కొట్టేసేది సునీల్..తన కామెడీ తో[రొటీన్ అయునా...]ఆకట్టుకుంటాడు.
  • hansika and sheela ఇద్దరూ బాగా perform చేశారు..
  • పరుచూరి వెంకటేశ్వరరావు గారు m.s raju cinema లో ఎప్పుడు విలన్ పక్కనే ఉండే characters తప్ప వేరేవి చెయ్యరా ?.
  • ముకేష్ ఋషి,ప్రదీప్ రావత్ తమ స్టైల్ లో ఆకట్టుకుంటారు...ప్రదీప్ రావత్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా audience responce super..
  • ఝాన్సీ,నరేష్..ధర్మవరపు అందరూ o.k..brahmanandam and telangana sakunthala ఇద్దరికి సినిమాలో performance కి స్కోప్ లేని పాత్రలు..
final గా మార్క్స్ ఇస్తే 60 marks తో 1st class లో [కాపీ కొట్టినా..] పాస్ అయుంది మస్కా...